మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలి అని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చెప్పినది చేయడం సబబు కాదు అన్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హామీల అమలును కాలయాపన చేస్తున్నారు. సాక్షాత్తూ నా పై, కుటుంబ సభ్యుల పై ఒక రౌడీ షీటర్ తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారని అన్నారు. అలానే ఆలయం కడితే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చినట్టు కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పారు. అప్పుడు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాం అని అన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహం, ఆలయం అన్నీ ఒకే సర్వే నంబర్స్ లతో ఉన్నాయి. ఇది వరకు ఎమ్మెల్యేగా పని చేసిన నాపై కూడా అక్రమ కేసులు బానాయిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పుకొచ్చారు. అలానే అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.