పార్టీలు మారె చరిత్ర నాది కాదు: అరూరి రమేష్

-

అరూరి రమేష్ పలు కామెంట్స్ చేసారు. పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ చెప్పారు. గత కొన్నిరోజులుగా నేను పార్టీ మారుతున్నా అని వార్తలు వస్తున్నాయి అని, అలాంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని అన్నారు. 2012 లో PRP పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారి నాయకత్వంలో నేను ఆ పార్టీలో చేరాను అని అన్నారు.

అయితే అప్పడినుండి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశాను అని అన్నారు. నా యొక్క పని తీరును గుర్తించి కెసిఆర్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్గిగా అవకాశం ఇచ్చారని, వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యునిగా మరియు పార్టీ జిల్లా అద్యక్షునిగా కూడా ఛాన్స్ ఇచ్చారన్నారు. నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పల కాపాడుకునే వ్యక్తిని అన్నారు. నియోజకవర్గ అబివృద్ది కోసం, పార్టీ కార్యక్రమాల్లో అనుక్షణం కష్టపడుతూ పని చేస్తాను, మాట మిద నిలబడే వ్యక్తిని అని కూడా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version