బాలికపై సామూహిక అత్యాచారం…!

-

ఏపీలో కామాంధుల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల పాటు నరకం చూపించి నడివీధిలో వదిలేసి పరారయ్యాయి. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

rape
rape

బాలికను బలవంతంగా తీసుకెళ్లి గదిలో బంధించి కామాంధులు దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. పశువుల్లా మీద పడి కామకోరికలు తీర్చుకున్నారు. నాలుగు రోజులు నరకం చూపించారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసిన కామాంధులు కారులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం.

ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బూసిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రధానోపాధ్యాయురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఫోక్స్ , దిశా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news