ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించి పంపిన మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లాంఛనమే అని తెలుస్తోంది. గవర్నర్ ఇప్పటికే దీనిపై సానుకూలంగా ఉన్నట్లు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అర్ధమైంది.
ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు గవర్నర్ హరిచందన్ తన ప్రసంగంలోనే వెల్లడించారు. ఓవైపు కరోనా తీవ్రత ఉండగా.. ఇప్పుడు మూడు రాజధానుల అంశం అవసరమా? అని టీడీపీ ప్రశ్నించింది. వివాదాస్పదమైన బిల్లులపై గవర్నర్ అలోచించి నిర్ణయం తీసుకోవాలంది. ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.