కరీంనగర్ రోడ్డు ప్రమాదంపై మంత్రి గంగుల స్పందించారు. కమాన్ వద్ద కారు ప్రమాదంపై దిగ్భ్రాంతి గురయ్యామమని.. చాలా బాధకరమైన ఘటన జరిగిందన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని.. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్ల పై ఉండొద్దని చెబుతూ ఉన్నామని వెల్లడించారు. సీసా కమ్ముల వారిని అక్కడ ఉండవద్దని చాలా సార్లు తీపించామని.. కమాన్ దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే చెప్పాం కానీ వారు అక్కడే ఉంటున్నారని వెల్లడించారు.
స్పెషల్ టీం కూడా అటువంటి వారిని తొలిగిస్తుందని.. ఇటువంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి ప్రజలు సహకారం లేకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. ప్రమాద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇల్లులు కేటాయిస్తామని… ఒక్కో బాధిత కుటుంబాలకు 80 వేలు ఆర్థిక సహాయం అందించామని ప్రకటన చేశారు. గాయపడ్డ వారికి 50 వేలు ఆర్థిక సహాయం ఇచ్చి వారికి మెరుగైన వైద్యం సేవలు అందించేలా చూస్తున్నామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.