మళ్ళీ పెరిగిన వంట నూనె ధరలు..!

-

వంట నూనె ధరలు ఢిల్లీ మార్కెట్ లో మళ్ళీ పెరిగాయి. దీనితో సామాన్యులకి ఇబ్బందిగా ఉంటుంది. క్రూడ్ పామాయిల్ కొనుగోలుదారులు తక్కువగా ఉన్నప్పటికీ మలేషియాలో వీటి ధరలు ఎక్కువగా వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం తో
మార్కెట్లలో కూడా ధరలు పెరిగాయి. అయితే సీపీఓ కొనుగోలుదారులు తగ్గిపోయినట్టు ట్రేడర్లు చెప్పారు. ఈ కారణం వలన సీపీఓను ఎవరూ దిగుమతి చేసుకోవడం లేదు. ధరలు బలవంతంగా పెంచేందుకు మార్కెట్లో కొన్ని మ్యూచువల్ గ్రూప్స్ పనిచేశాయని ట్రేడర్లు చెప్పడం జరిగింది.

 

ఇది ఇలా ఉండగా భారత్‌కు దిగుమతయ్యే పామాయిల్‌లో 60 శాతం అందించే ఇండోనేషియా ఎగుమతులను తగ్గించాలని అనుకుంటోంది. అయితే ఇది కూడా వినియోగదారుల పై ఎఫెక్ట్ చూపనుంది. మలేషియాలో పామాయిల్ రేట్లు పెరిగే సరికి వీటి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సుంకాలను తగ్గించడం జరిగింది. అలానే ఆయిల్ సప్లై కూడా పెంచారు. మలేషియా, ఇండోనేషియాలు ధరల వలన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదే విధంగా సోయాబీన్ ఆయిల్ ధరను మించిపోయి క్రూడ్ పామాయిల్ ధరలు వున్నాయి. సీపీఓ ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కూడా ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎక్కువ మంది సోయాబీన్, వేరుశెనగ ఆయిల్స్‌ను తీసుకుంటున్నారు. ఇక మస్టర్డ్ విషయానికి వస్తే.. మస్టర్డ్ గింజల స్టాక్‌ను కనీసం 2.5 మిలియన్ టన్నులు క్రియేట్ చేయాలని సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అంది. 2020-21లో భారత్ దిగుమతి చేసుకున్న వంట నూనెల విలువ రూ.1.17 లక్షల కోట్లకు పెరిగింది. గ్లోబల్‌గా ధరలు పెరగడంతోనే ఇది కూడ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version