బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం గంగూలీకి వైద్యులు సర్జరీ చేయనున్నారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అంటున్నారు. తేలికపాటి కార్డియాక్ అరెస్ట్ తో బాధపడుతున్న ఆయనని కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్ హాస్పిటల్ లోని అత్యవసర వార్డులో చేర్చారు.
శుక్రవారం సాయంత్రం వర్కౌట్ సెషన్ తరువాత గంగూలీ ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. ఈ ఉదయం కూడా అలాంటి సమస్యే పునరావృతమై కారణంగా కుటుంబ సభ్యులు ఈ రోజు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. “గంగూలీ ఇప్పుడు స్థిరంగా ఉన్నాడు. ఈ నొప్పి గుండె సమస్య వల్ల ఉందా లేదా అని మేము తనిఖీ చేస్తున్నాము. ఆయనకు అనేక పరీక్షలు చేయవలసి ఉంది” అని ఒక హాస్పిటల్ అధికారి పేర్కొన్నారు.