జగన్ 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ : గంటా

-

గంటాటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూల్చిన జగన్ విధ్వంసానికి నాంది పలికాడని విమర్శించారు. ఆర్థిక నేరాలకు కారణంగా అరెస్టయిన జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ జగన్ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని అనడం అక్కడి ప్రజలకు నిజంగా దుర్వార్తేనని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ అన్ని అక్రమాలకు నిలయంగా మారిందని, ఇక జగన్ అడుగుపెడితే పులివెందుల సంస్కృతి కూడా వచ్చేస్తుందని అన్నారు.

ఇది ఇలా ఉంటె మాజీమంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేపై వాట్సప్‌లో వచ్చిన ఓ పోస్టు ఫార్వర్డ్‌ చేశారన్న కారణంతో తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, 70 ఏళ్ల వృద్ధుడైన నలంద కిషోర్‌ను కొన్నాళ్ల కిందట పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి పోలీసు వాహనంలో కర్నూలుకు తరలించి వేధించారు. కొన్నాళ్లకే ఆయన మానసిక వేదనతో చనిపోయారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ జె.సాంబశివరావు అనే వ్యక్తిని మంగళగిరి పోలీసులు గతంలో అరెస్టు చేశారు. సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ ప్రకారం నోటీసు ఎందుకివ్వలేదని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కోర్టుధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించి..తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. వాట్సప్‌లో వచ్చిన పోస్టును ఫార్వర్డ్‌ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్టు చేయగా.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని న్యాయస్థానం సీఐడీ అధికారులను ప్రశ్నించి, షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version