సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఊహించిన విధంగానే.. ఒకటో తారీఖు రాగానే.. ధరలను పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీకి వినియోగించే నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం 40% మేర పెంచింది.
నేటి నుంచి 6 నెలల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) వెల్లడించింది. CNG వాహనాల్లో, ఇళ్లల్లో వంట కోసం వినియోగించే పైపులైను గ్యాస్ గాను సహజవాయువును వినియోగిస్తారు. ధరల పెంపుతో CNG నీ వినియోగించే వాహనదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.