రోడ్ సేఫ్టీ పై స్కూల్ లలో అవేర్నెస్ పార్కులు..!

-

రాష్ట్రంలో 15 సంవత్సరాల దాటిన వాహనాలు స్క్రాప్ చేయాలని పాలాసి తెచ్చాం అని పేర్కొన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో 4 రాష్ట్రాలు తిరిగాం. వికాస్ రాజ్,సురేంద్ర మోహన్ లు కలిసి బెస్ట్ పాలసీ తెస్తున్నాంఅని పేర్కొన్నారు. అలాగే వాహన సారథి లో కూడా 29 రాష్ట్రాల్లో తెలంగాణ చేరుతుంది. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలి అన్నారు.

అయితే దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. తెలంగాణ లో రోజుకు 20 మంది చనిపోతున్నారు. రోడ్ సేఫ్టీ పై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. యునిసెఫ్ ద్వారా స్కూల్ లలో రోడ్డు అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా నియమకమైన వారిని ఎన్ఫోర్స్ మెంట్ లో పెడుతున్నాం. రవాణా శాఖ కు కొత్త లోగో వస్తుంది. కొత్త వాహనాలు వస్తున్నాయి. ఎన్ఫోర్స్ మెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అని సూచించారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version