ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినట్టుగా ఆడే కరేబియన్ క్రికెట్ సునామి క్రిస్ గేల్.. మళ్లీ తన హిట్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆరోగ్యం బాగలేక పోవడంతో.. జనవరి నుంచి పిచ్‌లో అడుగుబెట్టని వెస్టిండీస్ వెటరన్.. నేరుగా క్రీజులోకి దూకీ దూకడంతోనే పంజాబ్‌ను గెలిపించాడు.
ఐపీఎల్ 2020లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన గేల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితమైన గేల్.. ఆర్సీబీపై బరిలో దిగి అభిమానులను అలరించాడు.
జనవరి తర్వాత తొలిసారి బ్యాట్ పట్టిన గేల్..ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లతో అభిమానులను క్రిస్ గేల్ అలరించాడు. టీ20ల్లో అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. 13వేల 349 రన్స్‌తో.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కరేబియన్ క్రికెట్ దిగ్గజం బౌండరీల ద్వారానే పది వేల పరుగుల్ని పూర్తి చేయడం విశేషం. టీ20ల్లో గేల్ 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. ప్రస్తుతం గేల్ కాకుండా కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ టీ20ల్లో పది వేలకుపైగా పరుగులు చేశారు.