సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదే…- రేవంత్ రెడ్డి.

-

సింగరేణిలో 4 కోల్ బ్లాక్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగారు. నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేయనున్నారు. కోల్ బ్లాక్స్ వేలంతో పాటు తమ 12 డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పలు కార్మికసంఘాలతో పాటు వివిధ పార్టీలు సింగరేణి సమ్మెకు మద్దతు పలికారు.

తాజాగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా ట్విట్ చేశాడు. దేశానికి వెలుగులు పంచే సింగరేణిని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. 4 గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తు,కార్మికుల సమ్మెకు మద్ధతిస్తున్నాం అని తెలిపాడు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. అని స్పష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version