ఎల్ఐసీ నుండి సూపర్ స్కీమ్.. నెల నెలా రూ.10 వేలు…!

-

చాలా మంది నచ్చిన స్కీముల్లో డబ్బులు పెడుతూ వుంటారు. ఇలా నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కటి లాభాలని పొందవచ్చు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఎల్ఐసీ లో కూడా చాలా మంది డబ్బులు పెడుతుంటారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. రెగ్యులర్‌గా పెన్షన్ పొందాలని చూస్తుంటే ఇక్కడ మీరు డబ్బులు పెట్టుకోవచ్చు. ఎల్ఐసీ అదిరే పాలసీలు అందిస్తోంది. దీనిలో పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ఎల్ఐసీ అందించే ప్లాన్స్‌లో జీవన్ శాంతి పాలసీ ఒకటి. పాపులర్ స్కీమ్స్‌లో ఇదీ ఒకటి. ఒకసారి డబ్బులు పెట్టారంటే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.

Life Insurance Corporation

ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఈ పాలసీలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ఆప్షన్ అనేది కూడా వుంది. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఆప్షన్లు దీనిలో వున్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. వెంటనే ఐదేళ్ల తర్వాత పెన్షన్ పొందాలని భావిస్తే డిఫర్డ్ ప్లాన్ కింద ఐదేళ్లు ఆప్షన్ ఎంచుకోవాలి. 6.81 శాతం నుంచి 14.62 శాతం వరకు రాబడి దీని ద్వారా పొందవచ్చు. ఎంచుకునే టెన్యూర్, వయసు ఆధారంగా రాబడి వస్తుంది.

పెన్షన్ మొత్తాన్న ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల చొప్పున పొందొచ్చు. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు వయసు వాళ్ళు దీనికి అర్హులు. రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే
30 ఏళ్లు వాళ్ళు ఈ డబ్బు పెడితే పదేళ్ళయ్యాకా ప్రతి నెలా దాదాపు రూ. 10 వేల వరకు డబ్బులు వస్తాయి. 40 ఏళ్ల నుంచి మీకు ఈ పెన్షన్ వస్తుంది. పాలసీదారుడు చనిపోతే నామినీకి రూ. 11 లక్షలు వెనక్కి చెల్లిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news