LIC: ఇలా ప్రతి నెలా రూ.10,000 పొందచ్చు.. కష్టపడక్కర్లేదు..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన చక్కటి లాభాలని పొందొచ్చు. ఎల్ఐసీ పాలసీల్లో కూడా చాలా మంది డబ్బులని పెడుతున్నారు. ఇలా ఈ పాలసీల్లో డబ్బులని పెడితే అందరికీ కూడా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో చేరితే నెల నెలా క్రమం తప్పకుండా డబ్బులుని పొందవచ్చు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఇది పెన్షన్ ప్లాన్. అందరికీ ఇది వర్తించదు.

Life Insurance Corporation

కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు వయసు వారు మాత్రమే ఈ స్కీమ్‌ లో చేరేందుకు అవుతుంది. క్రమం తప్పకుండా ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. పూర్తి రక్షణ కూడా ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే.. బీమా డబ్బులు కూడా వస్తాయి.

ప్రతి నెలా పెన్షన్‌తో పాటు ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు. ఈ పాలసీ ని తీసుకుంటే ఒకేసారి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా పెన్షన్ మీకు వస్తుంది. ఒక్కసారి ఒక ఆప్షన్ ఎంచుకుంటే మళ్ళీ మార్చుకోవడం అవ్వదు. పాలసీ తీసుకున్న తర్వాత 1 నుంచి 12 ఏళ్ల వరకు యాన్యుటీ డిఫర్డ్ ని ఎంపిక చేసుకోచ్చు. పాలసీదారుడు మరణించిన తర్వాత బీమా మొత్తం పొందాలా లేదా అనే ఆప్షన్ కూడా వుంది. దేనిని అయినా ఎంచుకోవచ్చు.

కనీసం రూ.1.5 లక్షల మొత్తానికి బీమా కొనుగోలు చెయ్యాలి. మాక్సిమం లిమిట్ ఏమి లేదు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఎంత మొత్తానికి అయినా పాలసీ తీసుకోవచ్చు. రూ.1000 నుంచి రూ. 12 వేల వరకు ప్రతీ నెలా వస్తుంది. రూ.10 లక్షలు పెట్టి ఈ పాలసీలో చేరితే.. డిఫర్మెంట్ పీరియడ్ 12 ఏళ్లు. సెకండరీ యాన్యుటెంట్ వయసు 35 ఏళ్లు. అదే మీరు డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ తీసుకుంటే నెలకు రూ. 11,192 వరకు వస్తాయి. అదే డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ కి అయితే నెలకు రూ. 10.576.

Read more RELATED
Recommended to you

Exit mobile version