కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.1627284..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీముల ద్వారా చాలామంది ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. స్థిరమైన, సురక్షితమైన మార్గంలో రాబడిని అందించే పథకాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. అయితే కేంద్రం అందించే స్కీములతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

పన్ను ఆదా ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి 7.1% వడ్డీ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ వంటి మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ వంటివి ఎక్కువ రాబడి ఇస్తాయి కానీ PPF వలన రిస్క్ ఉండదు. ప్రస్తుతం దినికి ప్రభుత్వం మద్దతు ఉంది. సురక్షిత రాబడిని ఇది అందిస్తుంది. ఇందులో పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం కూడా ఉండదు. మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి పన్నులు ఉండవు.

సబ్స్క్రైబర్లు PPF కాంట్రిబ్యూషన్ పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ కింద డిడక్షన్ ని క్లెయిమ్ చేయొచ్చు. సంవత్సరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం 500 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. PPF లో పెట్టుబడులకు 15 సంవత్సరాల లాక్ ఇన్ ఉంటుంది. సేవింగ్స్ పై కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నెలకు 2000 పెడితే సంవత్సరానికి 24,000 అవుతుంది. 15 ఏళ్లకు మూడు లక్షల అరవై వేలు. ప్రస్తుత వడ్డీ రేటు 7.1 మెచ్యూరిటీ మొత్తం 6,50,913. అదే ఒకవేళ మీరు ఇందులో 5000 నెలకి పెట్టినట్లయితే 15 సంవత్సరాలకి 9 లక్షలు అవుతుంది. 1627284 వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version