కేంద్రం గుడ్ న్యూస్.. రూ.100 పొదుపుతో రూ.27 లక్షలు.. నెలకి రూ.9 వేలు..!

-

చాలా మంది భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఇలా డబ్బులని పెట్టడం వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. తక్కువ మొత్తంతోనే భారీ రాబడి పొందాలని అనుకుంటే ఈ స్కీమ్ బాగుంటుంది. రూ. 100 పొదుపుతోనే మీరు ఏకంగా రూ. 40 లక్షలకు పైగా ఈ స్కీమ్ కింద పొందేందుకు అవుతుంది. కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తీసుకొచ్చింది. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కూడా ఒకటి. ఇందులో చేరడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. అలానే ట్యాక్స్ బెనిఫిట్స్, రాబడి కూడా.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ కొన్ని రూల్స్ ని తీసుకు రావడం జరిగింది. స్కీమ్ నుంచి వైదొలగాలన్నా.. యాన్యుటీ క్రమం తప్పకుండా పొందాలన్నా డాక్యుమెంట్స్ ని అప్‌లోడ్ చెయ్యాల్సి వుంది. విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా ఎగ్జిట్ ఫామ్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ని అప్లోడ్ చేసుకోవాలి. 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ఈ స్కీమ్ కింద పెన్షన్ ని పొందొచ్చు. అప్పటి దాకా ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు పెట్టిన డబ్బులని బట్టీ పెన్షన్ ఉంటుంది.

నెలకి మూడు వేలని ఇన్వెస్ట్ చెయ్యాలని భావిస్తే మీరు రోజుకు దాదాపు రూ. 100 పొదుపు చెయ్యాల్సి వుంది. 34 ఏళ్లు మీ వయస్సు అయితే 10 శాతం రాబడి వస్తుందని అనుకుంటే… మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 9.36 లక్షలు అవుతుంది. ఈ లెక్కన మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 44.35 లక్షల వరకు వస్తాయి. దీనిలో మీరు కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌ లో పెట్టాలి. మీ చేతికి దాదాపు రూ. 27 లక్షలు వస్తాయి. రూ. 17.8 లక్షలు పెట్టి యాన్యుటీ ప్లాన్ కొనాలి. నెలకు దాదాపు రూ. 9 వేల పెన్షన్ ని పొందొచ్చు. యాన్యుటీ రేటును 6 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం.

 

Read more RELATED
Recommended to you

Latest news