ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులు పెడితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా ఉండదు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల పథకాల్ని అందిస్తోంది. ఈ పథకాల ద్వారా చాలా మంది డబ్బులని పొందుతున్నారు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామ సురక్ష యోజన ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
ఈ స్కీములో డబ్బులు పెట్టాలంటే వాళ్ళ వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. 55 సంవత్సరాలకు మించకూడదు. పథకంలో చేరి ఐదేళ్లలోపు నిష్క్రమిస్తే మాత్రం బోనస్ ని పొందడానికి కుదరదు. ఈ స్కీము లో కనిష్ట హామీ మొత్తం రూ. 10,000 గా వుంది. గరిష్ట హామీ మొత్తం రూ. 10 లక్షలు. అలానే నాలుగు సంవత్సరాల కవరేజీ తర్వాత లోన్ బెనిఫిట్ ని కూడా పొందవచ్చు.
ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.60 వరకు బోనస్ ని ఈ స్కీమ్ తో పొందవచ్చు కూడా. 59 సంవత్సరాల వయస్సు వరకు ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీగా మార్చవచ్చు. 55, 58 లేదా 60 సంవత్సరాల కి ప్రీమియంలు చెల్లించవచ్చు.
ఈ స్కీమ్ లో మీరు రోజుకు కేవలం రూ. 50 చెల్లిస్తే అప్పుడు రూ. 35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. ప్రతి నెలా రూ.1,515 పెట్టుబడి పెట్టారంటే అంటే రోజుకు సుమారు రూ.50 పెడితే… పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీదారు రూ.34.60 లక్షల రాబడిని పొందవచ్చు. 55 ఏళ్ల కి రూ. 31,60,000, 58 ఏళ్ల కి రూ. 33,40,000 వస్తాయి. 60 ఏళ్ల కి రూ. 34.60 లక్షలు ని పొందొచ్చు.