LIC సూపర్ స్కీమ్.. పది వేల పెట్టుబడితో లక్ష రూపాయలు..!

-

జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని నచ్చిన వాటిలో డబ్బులు పెడుతూ వుంటారు. నిజానికి స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండేందుకు అవుతుంది. LIC కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం సురక్షితమే. పైగా రిస్క్ ఏమి ఉండదు.

బీమా జ్యోతి పేరుతో ఓ కొత్త పాలసీ ని అందిస్తోంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… సహజ మరణంతో పాటు ప్రమాదవశాత్తూ మరణించినా కూడా బీమా ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పాలసీని తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చు. ప్రమాదకర వృత్తుల్లో పని చేసే వారు ఈ పాలసీని తీసుకుంటే ప్లస్ అవుతుంది. సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ప్రీమియం కడితే పాలసీదారుడు చనిపోయాక కుటుంబానికి నెల నెలా నిర్ధిష్ట మొత్తంలో రూ.1,08,000 వరకూ కూడా కవరేజి వస్తుంది.

పాలసీదారుని వయస్సు, కట్టే ప్రీమియంల ఆధారంగా ఈ కవరేజీ వస్తుంది. మీరు దీనిలో అధిక పెట్టుబడి పెడితే అధిక ఆదాయం వస్తుంది. 30 ఏళ్ల పాలసీదారుడు సంవత్సరానికి రూ. 10 వేల ప్రీమియం చొప్పున 20 సంవత్సరాలకి కడితే అతను చనిపోయాక కుటుంబానికి నెల నెలా రూ. 5,000 వస్తాయి. అదే 40 ఏళ్ల వాళ్ళు సంవత్సరానికి రూ. 10 వేల ప్రీమియాన్ని 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే నెలకి రూ.4,500 వస్తాయి. ఈ పాలసీ ని మీరు తీసుకోవాలనుకుంటే ఎల్ఐసీ బ్రాంచ్ కి వెళ్లి తీసుకోవచ్చు. వెబ్ సైట్ లో కూడా మీరు ఈ పాలసీ ని తీసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news