చాలా మంది కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడతారు. దీని కోసం కేవలం ఇంటి చిట్కాలను పాటిస్తే కూడా సరిపోతుంది. అయితే కాన్స్టిపేషన్ సమస్య నుండి ఎలా బయట పడాలి..?, ఏమేమి తింటే సమస్య ఉండదు…? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాన్స్టిపేషన్ సమస్య నుండి బయట పడాలంటే ఆహారం తప్పక ఈ ఆహారం తీసుకోండి.
కూరగాయలు:
కాన్స్టిపేషన్ సమస్య నుండి బయట పడాలంటే కూరగాయలు బాగా ఉపయోగపడతాయి. బ్రోకలీ, టమాటాలు, క్యారెట్లు, బఠాణి తీసుకోవడం వల్ల ఇది డైజెస్టివ్ సిస్టం ని స్ట్రాంగ్ గా చేస్తుంది. దానితో ఈ సమస్య నుండి సులువుగా బయట పడొచ్చు.
బాదం:
బాదం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తుంది. అదే విధంగా ఇందులో విటమిన్ ఈ , ఫైబర్ కూడా ఉంటాయి. ఉదయాన్నే బాదాం తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ నుండి బయట పడచ్చు.
జొన్నలతో చేసిన రోటీ, కిచిడి కూడా సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కూడా మంచిది. కానీ డైరీప్రొడక్ట్స్ ను వీలైనంత వరకు తగ్గించడం మంచిది. అదే
విధంగా మద్య పానానికి దూరంగా ఉండండి. ఫ్రై చేసిన ఆహారం, బయట రోస్ట్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది.