ఇలా సులభంగా ఒత్తిడి నుండి బయటపడండి..!

-

ఉద్యోగాలు మొదలైన కారణాల వల్ల తీవ్ర ఒత్తిడిని చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఒత్తిడి నుండి బయట పడటం నిజంగా చాలా ముఖ్యం. ఒత్తిడి తొలగిపోతే ఎప్పుడు ఆనందంగా జీవించడానికి అవుతుంది. ఒత్తిడి నెగటివ్ ఆలోచనలు తొలగించి పాజిటివ్ ఆలోచనలని పెంచుతుంది. అందుకని ఒత్తిడిని తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని అనుసరించండి.

కెఫిన్, ఆల్కహాల్ కి దూరంగా ఉండండి:

కెఫిన్, ఆల్కహాల్ కి దూరంగా ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కెఫిన్ ఒత్తిడిని పెంచుతుంది. అదే విధంగా ఆల్కహాల్, డిప్రెషన్ కి గురి చేస్తుంది. అందుకనే వీటికి దూరంగా ఉండటం మంచిది.

నిద్రపోవడం:

చాలా మంది ఎక్కువసేపు నిద్రపోరు. అదే విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఒత్తిడి తొలగిపోవాలంటే మంచి నిద్ర చాలా అవసరం. కనీసం రోజులో ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అలానే నిద్రపోయే ముందు టీవీ, మొబైల్ ఫోన్ కి దూరంగా ఉండాలి.

ఎక్కువ నవ్వడం:

నిజంగా నవ్వడం అనేది ఒక ఔషధం. నవ్వితే ఒత్తిడి తగ్గుతుంది. అలానే మజిల్స్ ని రిలాక్స్ గా ఉంచుతుంది. మనం నవ్వినప్పుడు ఎండోర్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.

అందరితో మాట్లాడటం:

ఒంటరిగా కూర్చోవడం వల్ల ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరితో మాట్లాడటం, నడవడం చేయాలి. మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడిపితే ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఈ విధంగా వీటిని అనుసరించి ఖచ్చితంగా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version