మీరు రిటైర్ అయ్యే నాటికి డబ్బులుని దాచుకోవాలి అనుకుంటున్నారా..?, ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినా లేదా డబ్బులు పొందాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ స్కీం. దీనిలో బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో కనుక జరిగే ప్రతి నెల కూడా పెన్షన్ పొందవచ్చు. పైగా దీనిలో చేరడం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తూ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. అలాంటి వాటిలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి.
ఈ స్కీం లో ఇప్పటికి 90 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరడం జరిగింది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చింది. అటల్ పెన్షన్ యోజన పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉన్న వాళ్లు ఎవరైనా ఈ స్కీం లో చేరొచ్చు.
18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసులో వాళ్లు అర్హులు. ఈ స్కీం లో చేరిన వాళ్ళకి నెల వారీగా వెయ్యి రూపాయల నుండి 5000 వరకు పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా 42 రూపాయల నుండి 210 రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అయితే దీనిలో ఇన్వెస్ట్ చేసిన 60 సంవత్సరాల కి పెన్షన్ వస్తుంది.
సబ్స్క్రైబర్లు గరిష్టంగా 40 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఇరవై ఏళ్ళు ఈ స్కీమ్లో కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మరణిస్తే అతని భార్యకు చనిపోయే వరకు కూడా పెన్షన్ వస్తుంది. ఒకవేళ కనుక ఇద్దరూ మృతి చెందితే కార్పస్ మొత్తం నామిని అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ప్రీమియంని మాత్రం ప్రతి నెలా కనీసం మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు గాని చెల్లించాలి. ఈ స్కీం కింద వెయ్యి రూపాయల నుండి 5000 వరకు కూడా పొందొచ్చు. పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందొచ్చు.