రిటైర్మెంట్ తర్వాత ఏ సమస్య లేకుండా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం కొన్ని అదిరిపోయే స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ తో మీరు చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ అటల్ పెన్షన్ యోజన Atal Pension Scheme లో చేరడం వలన చాలా లాభాలు వున్నాయి. తక్కువ మొత్తంలోనే ప్రతి నెలా రూ.5 వేల వరకు పొందొచ్చు. అయితే దీనిలో మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు ప్రాతిపదికన నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పొందొచ్చు. 60 ఏళ్లు వచ్చే వరకు మీరు డబ్బులు తప్పక కడుతూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాతి నుంచి మీకు ప్రతి నెలా ఈ డబ్బులు వస్తాయి.
ఈ పధకంలో ఎవరు చేరచ్చు అనేది చూస్తే.. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరచ్చు. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.42 చెల్లిస్తే నెలవారీ పెన్షన్ కింద రూ.1000 పొందొచ్చు.
అదే ఒకవేళ రూ.2 వేలు పొందాలని అనుకుంటే అప్పుడు నెలకు రూ.84 కట్టాలి. రూ.5 వేలు పొందాలని చూస్తే.. నెలకు రూ.210 చెల్లించాలి. అంటే రోజుకు రూ.7 ఆదా చేస్తే చాలు. ఒకవేళ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు మరణిస్తే భాగస్వామికి పెన్షన్ డబ్బులు అందిస్తారు.