అదిరే కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. 20 రూపాయలతో రూ.2 లక్షల బెనిఫిట్..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా మందికి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. ఇక ఈ స్కీమ్ గురించి కూడా ఇప్పుడే చూద్దాం. బ్యాంక్ అకౌంట్లో ఒక 20 రూపాయలు ఉంటే చాలు రూ. 2 లక్షల ప్రమాద బీమాను పొందవచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. అనుకోని సంఘటనలు జరిగి మరణించినా లేదంటే వైకల్యం చెందినా ఆపద వేళలో అండగా నిలిచేందుకు కేంద్రం ఒక స్కీమ్ ని తెచ్చింది. సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రతను కేంద్రం పలు స్కీమ్స్ తో కల్పిస్తోంది.

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన తో కూడా చక్కటి లాభాలు పొందవచ్చు. 2015, మే 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఇన్సూరెన్స్ చేసుకుంటే ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షలు బీమా సంస్థలు ఇస్తాయి. ఒకవేళ పాక్షిక అంగ వైకల్యానికి గురైతే లక్ష ఇస్తారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న ప్రతీ ఒక్కరు కూడా దీనిలో చేరచ్చు. బ్యాంకు ఖాతాతో మీ ఆధార్ కార్డు నంబర్ అనుసందానమై ఉండాలి.

ఎన్ఆర్ఐలు కూడా ఇందులో చేరవచ్చు. ఈ బీమా పథకం వాలిడిటీ ఒక ఏడాది మాత్రమే. సేవింగ్స్ ఖాతా నుంచి ప్రీమియం ఆటో డెబిట్ చేయించి ఈ బీమాను రెన్యువల్ చేసుకోవాల్సి వుంది. ఈ స్కీమ్ ని మొదలు పెట్టాక కేంద్రం ప్రీమియం రూ.12 గా నిర్ణయించినా తర్వాత దాన్ని రూ.20కి చేర్చారు. ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ప్రీమియం ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది. అందుకే ఆ తేదీ కి ముందే రూ.20 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. రూ.20 ఖాతా లో లేకపోతే బీమా రెన్యువల్ అవ్వదు.

Read more RELATED
Recommended to you

Latest news