ఎన్నిక వివాదం.. మంత్రి కొప్పుల పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

-

బీఆర్ఎస్ నేతలను కోర్టు కేసులు వణికిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మరికొంత మంది నేతల ఎన్నికల వివాదం కేసులు కూడా ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి. ఇక తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై పిటిషన్ నమోదు కాగా.. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు తాజాగా తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హైకోర్టులో మధ్యంత పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2018లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ కొప్పుల ఈశ్వర్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news