కుక్కలను వదిలేస్తే ఇక మీ మీద కేసు…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు జనాలకు కొత్త భయం మొదలయింది. కుక్కలకు కరోనా వస్తుంది అనే ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. దీనితో చాలా మంది తమ ఇంట్లో ఉన్న కుక్కలను, పిల్లులను బయట వదిలేస్తున్నారు. కరోనా వస్తుంది అనే భయంతో తమ పెంపుడు జంతువులను విడిచిపెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనేక రాష్ట్రాల్లోని పోలీసులను పెటా కోరింది. వాటికి ఆహారం ఇచ్చే దుకాణాలు తెరిచే ఉన్నాయని తెలుసుకోవాలని కూడా సూచించింది.

భారీగా కుక్కలను పిల్లులను వదిలేస్తున్నారు. దీనిపై పెటా విచారణ కూడా చేసింది. పెటా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు ఒక లేఖ రాసింది, తమ పెంపుడు జంతువులను విడిచి పెట్టడానికి పోలీసులను సంప్రదించిన తర్వాతే వదలాలని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే వస్తుందని…

అది జంతువులకు సోకే అవకాశాలు దాదాపుగా లేవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. “ఈ రోజు వరకు, తోడు జంతువులు (పెంపుడు జంతువులు) ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల, పెంపుడు జంతువులపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి అర్ధం లేదని పేర్కొంది. కాగా అమెరికాలో రెండు పెంపుడు పిల్లులకు కరోనా వైరస్ సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news