దీపావళికి వరుణ్ తేజ్ ‘గని’ మూవీ.. అధికారిక ప్రకటన

-

బాక్సింగ్ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ”గని” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ పోస్టర్ లో హీరో వరుణ్ తేజ్.. మాసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అయితే తమకు తిరుగులేదని భావిస్తున్నారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్.

 

Read more RELATED
Recommended to you

Latest news