బ్రేకింగ్ : ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య…

Join Our Community
follow manalokam on social media

కొద్ది రోజుల క్రితం ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని డ్రామా ఆడిన ఘట్కేసర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో షుగర్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తన ప్రియుడితో కలిసి గంజాయి సేవించిన యువతి ఇంటికి ఆలస్యం అవుతున్న కారణంగా తన మీద గ్యాంగ్ రేప్ జరిగిందని తల్లికి పోన్ లో చెప్పింది. అయితే ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

dead
dead

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆమె తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కట్టు కధ అని చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురయింది అని పోలేసులు ప్రాధమికంగా గుర్తించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే అంశం మాత్రం క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...