Ghosty : కాజ‌ల్ ఫ‌స్ట్ హార‌ర్ మూవీ “ఘోస్టీ” టీజ‌ర్ రిలీజ్‌

-

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ లో తొలిసారి ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది కాజల్ అగర్వాల్. ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా ఘోస్టి టీజర్ సోమవారం రిలీజ్ అయింది. హారర్ కామెడీ మిక్స్ తో నవ్విస్తూనే ఈ టీజర్‌ భయపెడుతోంది. ఈ ఘోస్టి టీజర్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ పవర్ ఫుల్ లుక్ లో ఎంట్రీ ఇచ్చింది.

పోలీస్ స్టేషన్ లో ఓ దయ్యం ప్రవేశించడం, ఓ ఆత్మ కారణంగా కాజల్ తో పాటు మిగిలిన పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో టీజర్ ఆధ్యాంతం వినోదాత్మకంగా సాగింది. 18 ఏళ్ల సినీ ప్రయాణంలో కాజల్ అగర్వాల్ చేస్తున్న హారర్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఖండిస్తూ థియేటర్లలోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లు టీజర్ లో యోగి బాబు డైలాగ్ ద్వారా చెప్పించారు. ఘోస్టి సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news