50 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారా? – లక్ష్మణ్‌

-

50 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని బిజెపి రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్‌.. కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని ఆగ్రహించారు. నిన్న కేసిఆర్ పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణ తప్ప అందులో ఏమి లేదని..ప్రధాని మోడీ మీద అరిగిపోయిన టేపు రికార్డ్ లా మాట్లాడారని నిప్పులు చెరిగారు.

ఎనిమిది ఏళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయనిది కొత్తగా ఎదో చేస్తానని చెప్తున్నారని.. కొత్తగ ఎదో చేస్తానన్నారు అంటే ఈ ఎనిమిది ఏళ్లలో ఏమీ చేయలేదు అనే అర్థమన్నారు.చేనేత మీద 5 శాతం gst కి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. 20 లక్షల టర్నోవర్ మీద పన్ను కోరుకుంది మీరూ కాదా? నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే మీ 2.5% వడులుకోవచ్చు కదా? గీతా కార్మికులకు 10 లక్షల గీతా బందు ఎందుకు ఇవ్వవు? అని ప్రశ్నించారు. కొనుగోలు అంశం ఒక పెద్ద నాటకం.. ఆ నాటకంలో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శలు చేశారు బిజెపి రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news