58 నిమిషాల్లో 46 వంటలను చేసి తమిళనాడుకు చెందిన ఒక చిన్నారి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ప్రవేశించింది. తన వంటలతో ఎస్.ఎన్.లక్ష్మి సాయి శ్రీ ప్రపంచ రికార్డు సృష్టించింది. తాను చిన్నతనం నుండే వంట పట్ల ఆసక్తి పెంచుకున్నానని, ఆమెకు తల్లి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. నేను నా తల్లి నుండి వంట నేర్చుకున్నాను, నేను ఈ మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది” అని ఆమె మీడియాకి చెప్పారు.
ఇక లాక్ డౌన్ సమయంలో తన కుమార్తె వంట చేయడం ప్రారంభించిందని, ఆమె బాగా చేస్తుండటంతో, లక్ష్మి తండ్రి ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నం చేయాలని సూచించారని లక్ష్మి తల్లి ఎన్ కలైమగల్ చెప్పారు. “నేను తమిళనాడు యొక్క విభిన్న సాంప్రదాయ వంటకాలను వండుతూ ఉంటాను. లాక్ డౌన్ సమయంలో, నా కుమార్తె నాతో వంటగదిలో గడిపేది. నా భర్తతో వంట చేయడానికి ఆమె ఆసక్తి వేలిబుచ్చినప్పుడు ఆమె ప్రపంచ రికార్డులో ప్రయత్నం చేయాలని సూచించారు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది, అని ఆమె చెప్పారు. కేరళకు చెందిన సాన్వి అనే 10 ఏళ్ల అమ్మాయి సుమారు 30 వంటలు వండినట్లు లక్ష్మి తండ్రి కనుగొన్నారు అని అందు వల్ల తన కుమార్తె సాన్వి రికార్డును బద్దలు కొట్టాలని ఆయన ప్రయత్నాలు చేశారు అని ఆమె తెలిపింది.