‘‘అగ్రరాజ్యంంలో నవ వసంతంలోకి అడుగులేద్దామని అధ్యక్షుడు జోబైడెన్ పిలుపినిచ్చారు’’. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గందరగోళాలు ఉత్పన్నమైనా తమ దేశ ఎన్నికల సమగ్రత చెక్కుచెదరలేదన్నారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రకటించడంతో ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నో కుట్రలు పన్నినా నిజాయితే గెలిచిందన్నారు.
538 మంది సభ్యులతో కూడిన ఎన్నికల యంత్రాంగం బైడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. తన విజయం అడ్డుకునేందుకు ‘ట్రంప్’ కుట్రలు పన్నినా న్యాయం తనవైపు ఉంటడంతో ఘన విజయం సా«ధించాలని ధీమా వ్యక్తం చేశారు. అందూరు ఎకతాటిపైకి వచ్చి దేశ ఐకమత్యాన్ని తాటి అ«భివద్ధిలో పాటు పంచుకోవాలని ఉద్ఘాటించారు. ఎలాక్ట్రోరల్ కాలేజీ నుంచి అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణస్వీకారం చేయాల్సిందని ప్రకటించినట్లు సమాచారం అందుకున్న వెంటన బైడెన్ సొంత పట్టణమైన విల్మింగ్టన్ నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అభినందించిన పతిన్..
డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సా«ధించిన బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. మున్ముందు బైడెన్ మరెన్నో విజయాలు ఆక్షాంక్షించాలని ఓ సందేశాన్ని పంపారు. అధికారికంగా విజయం ప్రకటించకపోవడంతోనే తన అభినందనలు ఆలస్యమైనట్లు పుతిన్ పేర్కొన్నారు.
వాళ్లు కూడా..
అమెరికా ఫలితాలు తారుమారు అయ్యాయని ట్రంప్ అధికారులతో చర్చిస్తున్నా .. ‘ఆ పార్టీవారే సైతం బైడెన్ గెలుపును అంగీకరించారు’. మిచ్ మెక్ కానేల్, సౌత్ డకోటాసెనేటర్ జాన్ ధునే, మిస్సౌరి సెనేటర్ రాయ్బంట్తో పాటు అనేక మంది సేనెట్ మెజార్టీ నేతు బైడెన్ గెలుపును స్వాగతించారు.
రాజీనామా..
అటర్ని జనరల్ పదవికి విలియం బార్ రాజీనామా చేసినట్లు స్వయంగా ట్రంపే అధికారింగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశ ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయని ట్రంప్ పదేపదే అంటున్నా బార్ మాత్రం ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించారు.