రోడ్డుపై టిక్‌టాక్‌ చేస్తుంటే.. కుక్క కరిచింది.. వైరల్‌ వీడియో..!

టిక్‌టాక్‌ యాప్‌ నిజంగా కొందరు యూజర్లను ఓ రకమైన వ్యసనపరులుగా మార్చింది. కొందరు యూజర్లు ఆ యాప్‌ మోజులో పడి, పాపులర్‌ అవ్వడం కోసం ప్రాణాలకు తెగించి మరీ వీడియోలు పెడుతున్నారు. కొందరు మెదడు లేని పనులు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇక కొందరైతే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, సమయం సందర్భం లేకుండా వీడియోలు చేస్తూ ఆ యాప్‌లో పెడుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది.

girl done tiktok on road dog bitten

ప్రియా గొలాని అనబడే ఓ టిక్‌టాక్‌ యూజర్‌ అర్థరాత్రి రోడ్డుపై టిక్‌టాక్‌ వీడియో చేసింది. కత్రినా కైఫ్‌ నటించిన జర జర టచ్‌ మి టచ్‌ మి అనే సాంగ్‌కు స్టెప్పులేస్తూ రోడ్డుపై వీడియో చేయసాగింది. అయితే అంతలోనే వెనుక నుంచి వచ్చిన ఓ కుక్క ఆమె కుడికాలు తొడ వెనుక భాగంలో కరిచింది. దీంతో అదిరిపడ్డ ఆమె అక్కడి నుంచి పరారైంది. తరువాత ఇంటికి వెళ్లి కుక్క కరిచిన చోట మందు రాసింది. ఈ క్రమంలో ఆ రెండు వీడియోలను ఆమె టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసింది.

@priyagolani

oh god

♬ original sound – Cherry Bomb-Hattke – Cherry Bomb-Hattke

@priyagolani

kutte ne kat liya #tiktok bana rahi thi to

♬ original sound – priyagolani

అయితే కొందరు ఆ వీడియోలపై విమర్శిస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా.. వెనుక ఎవరు ఉన్నారో చూసుకోకుండా.. వీడియోలు చేస్తే ఇలాగే జరుగుతుందని, తిక్క కుదిరిందని, అలాగే జరగాలని.. కామెంట్లు పెడుతున్నారు.