ప్రేమలో ఉన్న వారికి లోకం తెలియదు అంటూ ఉంటారు… ప్రేమించిన వాళ్ళే ప్రపంచమని కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఊహలు అన్నీ కూడా ప్రేమించిన వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక వాళ్ళతో ఉండటం, వాళ్ళ వస్తువులు వాడటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అమ్మాయిలూ అయితే ఎక్కువగా అబ్బాయిల బండి మీద తిరగడం, వాళ్ళతో కలిసి షాపింగ్ చేయడాన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అబ్బాయిలు అయితే అమ్మాయిలతో ఎక్కువ సమయాన్ని,
గడపడానికి వాళ్ళను నిత్యం కలవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అమ్మాయిలకు ఇంకొక విషయం కూడా చాలా ఇష్టమట… బాయ్ ఫ్రెండ్ చొక్కాలు, హుడీలు ధరించడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ మనస్తత్వశాస్త్ర విభాగంలో పరిశోధకులు తాజాగా ఒక సర్వే నిర్వహించారు. 96 జంటలపై నిర్వహించిన ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన అబ్బాయి చొక్కా ధరించిన సమయంలో అమ్మాయిలూ చాలా సౌకర్యవంతంగా సంతోషంగా కనిపించారట.
వాళ్ళు మానసికంగా చాలా సంతోషంగా ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. ప్రేమలో లేని వారికి ఇచ్చి వేరే అబ్బాయి చొక్కా వేసుకోమంటే వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడలేదట. అదే విధంగా అబ్బాయి చొక్కాను నేరుగా వేసుకోవడానికే ఇష్టపడ్డారట గాని ఎలాంటి పర్ ఫ్యూమ్ లు వాడటానికి ఇష్టపడలేదని సర్వే పేర్కొంది. ఇక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చొక్కాను ఇంకొకరు ధరించడం కూడా అమ్మాయిలకు ఎంత మాత్రం ఇష్టం ఉండదట. ఇలా బాయ్ ఫ్రెండ్ చొక్కా ధరించిన అమ్మాయిల్లో ఆందోళన అనేది తక్కువగా ఉంటుందని అంటుంది సర్వే.