ఎవరూ లేరని.. లిఫ్ట్ లో విద్యార్థినిపై అక్కడ చేయి వేసి..

-

కామాంధులు రెచ్చిపోతున్నారు.. సందు దొరికితే… ఎక్కడ పడితే అక్కడ తాకుతూ.. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఓ విద్యార్థిని పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన లక్నోలోని అలంబాగ్‌ మెట్రోస్టేషన్‌లోని లిఫ్ట్‌లో చోటు చేసుకున్నది. ఆ తర్వాత విద్యార్థి పరుగెత్తుకుంటూ వెళ్లి విషయాన్ని సోదరికి చెప్పడంతో.. ఆమె నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అలంబాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్థిని హుస్సేన్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నది. రోజూ మెట్రో రైలులో వెళ్లి వస్తుండగా.. స్టేషన్‌ వద్దకు బాధితురాలి అక్క వెళ్లి తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే విద్యార్థిని ఎప్పటిలాగే రైలు దిగి.. మెట్రోస్టేషన్‌లోని లిఫ్ట్‌ ఎక్కింది. అదే సమయంలో 40-45 సంవత్సరాలున్న వ్యక్తి సైతం ఎక్కాడు. లిఫ్ట్‌ డోర్‌ మూతపడగా.. సదరు వ్యక్తి బాలికపై ప్రైవేట్ పార్ట్స్ పై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత లిఫ్ట్‌ డోర్లు తెరుచుకోగానే బాలిక అతన్ని తోసేసి బయటకు పరుగులు పెట్టింది. స్టేషన్‌ వద్ద ఉన్న సోదరికి విషయం మొత్తం వివరించింది. ఆమె నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. బాధితురాలి సోదరి తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version