పిల్ల‌ల కోసం క్షుద్ర పూజలు.. ఆరేళ్ళ బాలికపై రేప్‌.. లివర్ వెలికితీసి

ఉత్తర ప్రదేశ్‌ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఏడేళ్ల బాలికని చంపి అనంతరం ఆమె కాలేయం వెలికి తీయగా ఆమె అక్కడిక్కడే చనిపోయింది. నిందితులు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక ఇంటి పక్కన ఉండే వారికి సంతానం లేదు. తమకు లేకుండా పక్కన ఉన్న వారికి బాలిక ఉండడం వాళ్ళకి నచ్చలేదు. అయితే తమకు పిల్లలు పుట్టాలంటే ఏమి చేయలాని ఒక బాబాని అడిగితే క్షుద్ర పూజ‌ చేయాలని చెప్పాడు. దానికి చిన్నపిల్లలా శరీర భాగాలూ కావాలని చెప్పాడు. అందుకే వాళ్ళు ఊర్లో గాలికి తిరిగే ఇద్దరికీ ₹ 1,000 ఇచ్చి బాలికని చంపమని కోరారు.

దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి బాలికను కిడ్నాప్ చేశారని సమాచారం. మద్యం మత్తులో ఉన్న ఆ పురుషులు మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు, తరువాత ఆమెను చంపారని పోలీసులు చెప్పారు. తరువాత, వారు బాలిక శరీరం నుండి కాలేయాన్ని వెలికితీసి, క్షుద్రపూజల కోసం దంపతుల వద్దకు తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. మరికొన్ని శరీర భాగాలను కూడా తీసి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడానికి అనేక బృందాలను నియమించారు. బాలిక పొరుగువారి మీద అనుమానం రావడంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో వారు ఒప్పుకున్నారు.