తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ హెడ్ లైన్స్‌లో నిలవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్న కాస్త సమాజహితం కోసం చేసినట్లుగా ఉన్నాయని తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జేసీ ఇంతకు ఏమన్నారంటే..
తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని, వాళ్లని తాను అడ్డుకోనని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏపీలోని తన ఆఫీసులో ఆదివారం ఉదయం ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తాను కూడా వాళ్ల వ్యాపారంలో పెట్టుబడి పెడతానని.. 3 నెలల్లో రూ.3 కోట్లు పెడతానని.. 2025 డిసెంబర్ వరకు రూ.10 కోట్లు ఖర్చుపెట్టి నియోజకవర్గాన్ని సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తానన్నారు. ఇసుక వ్యాపారం, క్లబ్‌లు నడిపేవారు 15 శాతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కమీషన్ ఇవ్వాలని కోరారు.మీరు ఇచ్చే 15 శాతానికి మరో 15శాతం తాను కలిపి తాడిపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తానని చెప్పారు.