ఇంకో ఛాన్స్ ఇవ్వండంటున్న కార్తికేయ..

Join Our Community
follow manalokam on social media

ఆర్ ఎక్స్ 100సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ, ఆ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాఅలు తీస్తున్నప్పటికీ ఒక్కటీ ఆర్ ఎక్స్ 100లాంటి హిట్ పడటం లేదు. తాజాగా వచ్చిన చావు కబురు చల్లగా సినిమా కూడా పరాజయం పాలవడం కార్తికేయకి మింగుడు పడని అంశం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన ఈ చిత్రానికి రిలీజ్ ముందు మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయాయి.

దాంతో కార్తికేయకి ఈ సారి హిట్ పడుతుందనే అనుకున్నారు. కానీ, సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ని కరెక్టుగా డీల్ చేయకపోవడమో, మరింకోటోగానీ ప్రేక్షకులకి అంతగా రుచించలేదు. దాంతో కార్తికేయ ఖాతాలో మరో అపజయం వచ్చి చేరింది. ఈ విషయమై స్పందించిన కార్తికేయ, బస్తీ బాలరాజు పాత్ర తనని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిందని, సినిమా నచ్చని వాళ్ళు తప్పులుంటే క్షమించాలని, ఒక్క ఛాన్స్ ఇస్తే అలాంటి తప్పులేమీ చేయకుండా మళ్ళీ మంచి సినిమాతో వస్తానని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. తన సినిమా అపజయం గురించి నిర్భయంగా ఒప్పుకున్న హీరో అంటూ కార్తికేయపై పొగడ్తలు పడుతున్నాయి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...