‘NBK109′ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్

-

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ కొట్టి నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జోషిలో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ 109వ చిత్రం డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘NBK109’ గా రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ విడుదలైంది. మాస్ యాక్షన్తో బాలకృష్ణ అదరగొట్టారు. ‘సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదురా లఫూట్’ అన్న డైలాగ్తో ఆకట్టుకుంటోంది.గ్లింప్స్ బాలయ్య శివతాండవం చూపించారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు .ఇటీవల శరవేగంగా షూటింగ్ జరిగిన ఈ చిత్రం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తు ఉండడంతో బాలయ్య బాబు ఆ బిజీలో ఉండి షూట్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది .ఈ మూవీ 1980లో స్టోరీతో, ఫుల్ యాక్షన్ గా ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version