సోనూసూద్ ని ప్రశంసించిన గ్లోబల్ స్టార్..?

-

కరోనా సమయంలో తన గొప్ప మనసు చాటుకుని సోనూసూద్ ఆపద్బాంధవుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. కేవలం వలస కార్మికుల ను ఆదుకోవడమే కాదు… దేశంలో సహాయం కావాలన్నా ఎంతోమందికి సహాయం చేసి నిస్సహాయులు పాలిట దేవుడిగా మారిపోయాడు. ఇక కరోనా సంక్షోభం సమయంలో సోనుసూద్ చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి… సోను సూద్ కి ఒక అరుదైన గౌరవం ఇచ్చి అవార్డు ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

ఇక సోనూసూద్ కు వచ్చిన అవార్డు గురించి తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు మీకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవార్డుకు మీరు అర్హులే అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా. మీ సేవలు మునుముందు కూడా ఇలాగే కొనసాగించాలి అంటూ ఆకాంక్షిస్తున్నాను అంటూ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించగా.. వెంటనే స్పందించిన సోను సూద్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news