జీ మెయిల్‌ కొత్త పాలసీ !

-

జీమెయిల్‌ ఇకపై జూన్‌ 1 నుంచి గూగుల్‌ స్టోరేజీ పాలసీ మారనుంది. ఇప్పటి నుంచి గూగుల్‌ యాప్స్‌ బ్యాకప్‌ చేసే ఫైల్స్‌ అన్నీ వినియోగదారులకు లభించే 15జీబీ ఉచిత స్టోరేజీ కిందకే వస్తాయి.గూగుల్‌ హై క్వాలిటీ ఫోటోస్‌ బ్యాకప్‌ ఫైల్స్‌ కోసం అన్‌ లిమిటెడ్‌ స్టోరేజీని అందించేది. అది గతంలో అంటే ఫోటో స్టోరేజీతో పాటు అదనంగా 15జీబీ లభించేది. కానీ, తాజా మార్పుల తరువాత దీనికి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో డేటాను స్టోర్‌ చేసుకోవడానికి 15ఎఆ వరకు ఉచిత స్టోరేజీ లభిస్తుంది. జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్, ఇతర గూగుల్‌ సేవలను సొంతం చేసుకోవచ్చు. కానీ జూన్‌ 1 నుంచి బ్యాకప్‌ చేసుకునే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు కూడా ఈ 15 జీబీ ఉచిత స్టోరేజీ కిందకే వస్తాయి. అంటే జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్‌ వంటి అన్ని ఇతర గూగుల్‌ సేవలకు సంబంధించిన డేటా మాత్రమే ఉచితంగా బ్యాకప్‌ చేసుకోవచ్చు. అది మించితే అదనపు డేటా కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

  • ప్రస్తుతం స్టోరేజీ పరిమితంగా ఉంది కాబట్టి, గూగుల్‌ బ్యాకప్‌ లిస్ట్‌లో అనవసరమైన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకోవాలి. https://one.google.com/storage/management లింక్‌ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
  • అదనపు స్టోరేజీని కొనుగోలు చేసే అవకాశాన్ని గూగుల్‌ కల్పించింది. ఇందుకు ప్రత్యేకంగా గూగుల్‌ వన్‌ అనే యాప్‌ను సైతం సంస్థ విడుదల చేసింది. అవసరాలకు అనుగుణంగా, వేర్వేరు నెలవారీ, వార్షిక ప్లాన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు.
  • గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల వినియోగదారులు, ఇప్పటికే గూగుల్‌ వన్‌ కు అప్‌గ్రేడ్‌ అయిన వినియోగదారులు, గూగుల్‌ బిజినెస్‌ సేవలను ఉపయోగించే వారిపై తాజా నిబంధనల ప్రభావం ఉండదు.
  • గూగుల్‌ డ్రైవ్‌లో ఇతరులు యూజర్లకు షేర్‌ చేసిన ఫైల్స్, గూగుల్‌ సైట్ల డేటా, గూగుల్‌ డాక్స్, షీట్స్, స్లైడ్స్, ఫారమ్స్, జామ్‌బోర్డ్స్, డ్రాయింగ్‌ డేటాను గూగుల్‌ లెక్కలోకి తీసుకోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version