టికెట్ రేట్లపై హైకోర్ట్ కీలక ఉత్తర్వులు.. ఆ ప్రాంతాల థియేటర్లకు మాత్రమే జీవో 35 మినహాయింపు

-

టాలీవుడ్ కు టికెట్ల రేట్ల విషయంలో మళ్లీ షాక్ తగిలింది. తాజాగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పులో కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. కేవలం పిటిషన్ వేసిన ప్రాంతాల వారికి మాత్రమే జీవో నెం 35 నుంచి మినహాయింపునిచ్చారు. ఈ విషయాన్ని తీర్పు కాపీలో స్పష్టం చేసింది ఏపీ హైకోర్ట్. ఏపీలో మిగిలిన అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు జీవో 35కి అనుగుణంగానే ఉండనున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 35పై వేరువేరుగా మూడు రిట్ పిటీషన్లు దాఖలయ్యాయి. తెనాలిలో 4 థియేటర్లకు, చోడవరంలో 1 థియేటర్ కు టికెట్ రేట్ల విషమంలో పాత పద్దతిలోనే అనుమతి ఇచ్చారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఈ ప్రాంతాలకు సంబంధించిన వారు మాత్రమే రిట్ పిటీషన్ వేశారు. మిగిలిన అన్ని థియేటర్లు కూడా జీవో 35కి అనుగుణంగానే టికెట్ రేట్లను అమలు చేయాల్సిందే. ప్రస్తుతం పిటీషనర్లకు మాత్రమే టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు కలిగిన థియేటర్లు కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి తీసుకుని మాత్రమే టికెట్ రేట్లను పెంచుకోవాలని తీర్పు కాపీాలో వెల్లడించింది హైకోర్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version