వాలెంటైన్స్ డే వద్దా… అయితే ‘ మై కజిన్ వెడ్డింగ్’ కు వెళ్లండి.!

-

ప్రేమికుల రోజు.. లవర్స్ కు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది..ఈ వారం రోజులు వారికి పండగే..కానీ లవర్ లేని మన లాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి.. వాళ్లను చూసి ఏడ్వడమేనా..అరే మనకు కూడా లవర్ ఉంటే..బాగుండు అని ఈ వారం రోజులు సింగిల్స్ అందరూ అనుకుంటారు. ఇంకొందరు..ఈ వారం రోజులేరా..వాళ్లకు సంతోషం..మనకు ఏడాదంతా హ్యాపీయో అని సర్థి చెప్పుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే రోజు మీరు ఈ గోల అంతా లేకుండా..హ్యాపీగా ఉండే ఒక ప్లేస్ ఉంది..అక్కడికి లవర్సకు నో ఎంట్రీ.. కర్ణాటక దగ్గర్లో ఓ దీవి ఉంది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది..

ఆ దీవి పేరు మై కజిన్స్ వెడ్డింగ్ (My Cousin’s Wedding). ఇదేం పేర్రా బాబు ఇలా ఉంది అనుకుంటున్నారా..ఈ పేరు పెట్టడానికి వెనక బలమైన కారణం ఉంది. ఎవరైనా లవర్స్ డే నాడు నీ ప్లాన్స్ ఏంటి అని అడిగితే… “ప్లాన్స్ ఏమీ లేవు… నేను నా కజిన్ వెడ్డింగ్‌ (మై కజిన్స్ వెడ్డింగ్)కి వెళ్తున్నా” అని చెప్పుకోవచ్చు. తద్వారా లవర్స్ డే జరుపుకోవట్లేదు అని చెప్పకుండా ఉండేందుకు వీలుగా ఈ పేరు పెట్టారట. భలే క్రేజీగా ఉంది కదూ..

ప్రేమికుల రోజున ఎస్కేప్ అవ్వాలనుకునేవారు ఈ దీవిని ఎంచుకుంటున్నారు. కర్ణాటకకు దగ్గర్లో ఉన్న ఈ దీవికి వెళ్లాలనుకునేవారిని క్యాడ్బరీ 5 స్టార్ వాళ్లు తీసుకెళ్తారు. ఆ రోజున ఈ దీవికి వెళ్లేవారు పగలంతా అక్కడ ఎంజాయ్ చెయ్యవచ్చు. అలాగే లెక్కలేనన్ని 5 స్టార్స్ తినవచ్చు.
ఈ దీవికి పెద్దార్ రోడ్డు (Peddar Road)లో ఓ రాయబార (ఏంబసీ) కార్యాలయం ఉంది. ఎవరైనా దీవికి వెళ్లాలి అనుకునేవారు ముందుగా ఆ కార్యాలయంలో వీసా కోసం అప్లై చేసుకోవాలి.

ఒక్కటే కండీషన్:

దీవికి వెళ్లేవారికి మషీనెస్ ఉండకూడదు. ఏంబసీలో మష్ డిటెక్టర్ ఉంటుంది. మషీనెస్ ఉంటే అది కనిపెట్టేస్తుంది. అంటే… టాటూలు, కపుల్ పెండాంట్స్, మొబైల్ లో చీజీ రింగ్ టోన్లు, మషీ సాంగ్స్, హార్ట్ షేపులో ఏ వస్తువులూ మీ దగ్గర ఉండకూడదు. అంటే మీరు ప్రేమకు అనుకూలంగా ఉండకూడదన్నట్లు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నా, రెడ్ కలర్ లో ఏవైనా మీ దగ్గర ఉంటే కూడా ఆ డిటెక్టర్ ఓప్పుకోదు..

ఏంబసీలో వీసా ఫామ్ ఫిలప్ చేసి… ఇమ్మిగ్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈ ఫామ్ లో ఓ ఆసక్తికర ప్రశ్న ఉంటుంది. మీకు బాగా ఇబ్బంది పెట్టేది ఏంటి? అని… దానికి ఆబ్జెక్టివ్ ఆన్సర్లు ఉంటాయి. ట్విన్నింగ్ కపుల్స్, చీజీ మ్యూజిక్, రద్దీ రెస్టారెంట్లు, సెల్ఫీలు తీసుకుంటున్న జంటలు, తమ ప్లాన్స్ చెప్పి మీ ప్లాన్స్ అడిగేవారు అనే ఆన్సర్లు ఉంటాయి. ఈ దీవిలో ప్రశాంతతను వర్చువల్ రియాలిటీ (VR) ద్వారా పొందవచ్చు.

5 స్టార్ ప్యాకెట్ పై ఉండే QR కోడ్ ని స్కాన్ చేసి కూడా దీవికి వెళ్లేందుకు టికెట్ పొందవచ్చని 5 స్టార్ తెలిపింది. మరి మీరు వెళ్లాలి అనుకుంటున్నారా? మొత్తానికి భలే వింతంగా ఉంది కదూ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news