గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు పొత్తు కోసం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో తమ పార్టీ చర్చలు జరుపుతున్నదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవర్ మంగళవారం తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ భుజాలపైన స్వారీ చేసి గోవాలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ నేత శరద్ పవర్ స్పందించడం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
గోవాలో బీజేపీని గద్దె దింపడం కోసం కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలతో అతిపెద్ద కూటమి ఏర్పడటం అవసరమని తృణమూల్ కాంగ్రెస్ సూచించింది. కానీ, మిగతా పార్టీల నుంచి సరైన స్పందన రాలేదు. అయితే, గోవా ఫార్వర్డ్ పార్టీ(జీపీఎఫ్)తో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ)తో తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది.