పెద్దవూర మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 108 మందిపై కేసు నమోదు చేసి, రూ.6 లక్షల జరిమానా విధించినట్లు విద్యుత్ శాఖ ఏఈ దాసయ్య తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటికి మీటర్ బిగించుకోవాలని చెప్పారు.