ఆయన మంత్రి అయినందుకు దేవుడు కూడా బాధ పడ్డాడు…!

స్వామి దర్శనానికి వెళ్లి హుండీ కొట్టేసే టైప్ మంత్రి వెల్లంపల్లి అని మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. వెల్లంపల్లి లాంటి చేతకాని వ్యక్తి కి దేవాదాయశాఖ ఇచ్చినందుకు దేవుడు కూడా భాదపడుతున్నాడని ఆయన ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్డు మెంబర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి తక్కువ. అలాంటి వ్యక్తి కి కాలం కలిసొచ్చి మంత్రి పదవి వస్తే..పాలన పై దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడు ని టీడీపీని తిట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.శాసనమండలి పరిణామాలు... అసలు జరిగింది ఇదీ: టిడిపి ఎమ్మెల్సీ మంతెన వివరణ | TDP  MLC Manthena Satyanarayanaraju Explain About yesterday council incident

16 నెలల్లో దేవాదాయ శాఖ మంత్రి గా ఆయన చేసిందేంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ కింద ఎన్ని దేవాలయాలున్నాయో వెల్లంపల్లి కి తెలుసా? అని నిలదీశారు. దేవాలయాల్లో వరుస ప్రమాదాలు జరుగుతుంటే వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టకుండా రాజకీయాలు మాట్లాడడం సిగ్గనిపించడం లేదా? అని మండిపడ్డారు. వెల్లంపల్లి కి జగన్ భజన తప్ప భక్తుల మనోభావాలు పట్టవా? అని ఆరోపించారు.