దేవుడా.. ప్రేమ ఎక్కువై కొడుకును చంపేసిన తండ్రి..!

కొడుకుపై అతనికి ఉన్న ప్రేమ దారుణానికి దారితీసింది. తన కొడుకు భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉదయాన్నే భార్యను నిద్రలేపి కొడుకుని బాధల నుంచి విముక్తి చేశానని తను శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని ఆమెకి చెప్పాడు. భర్త మాటలు విన్న భార్య ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఈ అత్యంత దారుణ ఘటన యూపీలో జరిగింది.

murder
murder

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లోని సీసమౌ ఏరియాకి చెందిన అలంకార్ శ్రీవాస్తవ ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య సారిక గవర్నమెంట్ స్కూట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వారికి కొడుకు రుశాంక్(10), కూతుళ్లు గీతిక(10), తులిక(16) ఉన్నారు. పిల్లలను అమితంగా ప్రేమించే అలంకార్.. వారి భవిష్యత్తు గురించే కలలు కనేవాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తన ఉద్యోగం పోవడంతో డిప్రెషన్‌కి గురయ్యాడు. తన బిడ్డలకు మంచి భవిష్యత్ కల్పించలేకపోతున్నానంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై దారుణానికి పాల్పడ్డాడు.

అయితే రాత్రి తనతో పడుకున్న కొడుకు రుశాంక్‌ని అమానుషంగా చంపేశాడు. ఆ రాత్రంతా కొడుకు శవం పక్కనే నిద్రపోయాడు. ఉదయం డ్రాయింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి భార్య గదిలోకి వెళ్లి ఆమెను నిద్రలేపాడు. కొడుకుని చంపేశానని.. వాడికి ఇక ఏ ఇబ్బందులు ఉండవని చెప్పడంతో ఆమె షాక్‌కి గురైంది. వాడు శాశ్వతంగా నిద్రిస్తున్నాడని చెప్పడంతో కంగారుపడిన భార్య సారిక వెంటనే బంధువులకు సమాచారం అందించింది.

ఈ విషయం తెలుసుకుని పరుగున వచ్చిన బంధువులు బాలుడి విగతజీవిగా పడి ఉండడం చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్య సారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు చంపిన నేరం కింద అలంకార్‌ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.