మ‌గువ‌ల‌కు బిగ్ షాక్.. మ‌రోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి ప్రియుల‌కు మ‌రో బిగ్ షాక్. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. శుక్ర వారం తెలుగు రాష్ట్రాల్లో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 640 వ‌ర‌కు పెర‌గ‌గా.. ఈ రోజు రూ. 250 పెరిగింది. అలాగే వెండి శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల్లో కిలో గ్రాముపై రూ. 900 పెర‌గ‌గా.. ఈ రోజు రూ. 1000 పెరిగింది. అయితే గ‌త ఐదు రోజుల్లో నాలుగు రోజులు బంగారం ధ‌రలు భారీగా పెరిగాయి. ఈ ఐదు రోజుల్లో ప‌ది గ్రాముల ధ‌ర పై రూ. 1,420 వ‌ర‌కు పెరిగింది.

అలాగే వెండి ధ‌ర‌ కూడా ఈ ఐదు రోజుల్లో భారీగా పెరిగాయి. ఈ ఐదు రోజుల్లో ఏకంగా రూ. 3000 వ‌ర‌కు పెరిగాయి. కాగ నేటి ధ‌రలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,590 కు చేరుకుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 73,800 కు చేరుకుంది. కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధం త‌గ్గ‌క‌పోవ‌డం పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధ‌ర‌లు విపరీతంగా పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news