బంగారం ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా తగ్గింది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చి నిన్నఒక్కరోజే పెరిగిన బంగారం ధర ఈరోజు మళ్లీ పడిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అని చెప్పొచ్చు.
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.920 తగ్గుదలతో రూ.42,300కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గుదలతో రూ.38,700కు పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పడిపోయింది. బంగారం ధర ఏకంగా రూ.900 దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 తగ్గుదలతో రూ.39,550కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.900 క్షీణతతో రూ.40,750కు దిగొచ్చింది. ఇక వెండి ధర రూ.41,780కు పడిపోయింది.