ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఈ బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రేటు ఎంత ఉన్నప్పటికీ…. మహిళలు ఈ బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే.. ఈ బంగారం ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఇక మన దేశంలో… కరోనా విజృంభించినప్పటి నుంచి… విపరీతంగా పెరిగి పోతున్నాయి బంగారం ధరలు.
ఇప్పటి కే తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ. 63 వేల మార్క్ చాలా రోజుల కిందటే దాటేసింది. అయితే ఈ రోజు పెరిగిన ధరలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 58, 150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ. 63, 440 కి చేరుకుంది. బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు మాత్రం సామాన్యులకు ఊరట ఇచ్చాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి.. రూ. 77, 800 కు చేరింది.