గుడ్ న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు ద‌గ్గుద‌ల న‌మోదు చేసింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు తగ్గి 39,570 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయలు తగ్గి 36,270 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పులకూ లోనవ్వలేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గడంతో 37,050 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం నిలకడగా కేజీకి 46,650 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news